కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
అలంపూర్: బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. అలంపూర్ పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ....కేంద్ర ప్రభుత్వ నిధులతో అలంపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత కార్యర్తలపై ఉందన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుదద్ధ్యం వంటి సమస్యలు ఏళ్ల తరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించుకుందామన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామన్నారు.సమావేశంలో నాయకులు శరత్, మధుసుధన్ గౌడు, సుధాకర్ యాదవ్, రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, నరేష్, మహేష్, వినీత్ కుమార్, మద్దిలేటి, హేమంత్, జగన్‌మోహన్ రెడ్డి, రవి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.


