కదులుతున్న డొంక | - | Sakshi
Sakshi News home page

కదులుతున్న డొంక

Jan 8 2026 7:09 AM | Updated on Jan 8 2026 7:09 AM

కదులు

కదులుతున్న డొంక

పూర్తిస్థాయిలో విచారణ

బిగుస్తున్న ఊచ్చు

రెండు హత్యలపై పూర్తి స్థాయి విచారణ

పాత కేసులను తిరగతోడుతున్న

పోలీసులు

మిల్లు వీరన్నపై బిగుస్తున్న ఊచ్చు

ఒక్కొక్కటిగా వెలుగులోకి నేర చరిత్ర

–8లో u

మాజీ సర్పంచ్‌ భీమరాయుడును సుపారీ గ్యాంగ్‌చే హత్య చేయించినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. ఈ కేసులో మిల్లు వీరన్నతో పాటు మరికొందరు ఉన్నారు. కస్టడీలో మరో రెండు హత్యలు చేయించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఈ కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టు, కర్ణాటకలో నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తాం. నేరం చేసిన నిందితులు ఎవరైన సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు.

– శ్రీను, సీఐ గద్వాల

గద్వాల క్రైం: కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్‌ భీమ రాయుడు హత్య కేసులో జిల్లా పోలీసుశాఖ విచారణ చేపట్టి సుపారీ గ్యాంగ్‌ ముఠా సభ్యులను కటాకటాల్లోకి పంపారు. అయితే మాజీ సర్పంచ్‌ను హత్య చేయించేందుకు మిల్లు వీరన్న రూ.25 లక్షలు సుపారీ ఇవ్వడంతో.. బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారనే విషయం బహిర్గతం అయ్యింది. అయితే, కోర్టు అనుమతితో మిల్లు వీరన్నను మరోసారి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించగా.. మరో రెండు హత్య చేయించినట్లు వెల్లడించడంతో వాటిపై పోలీసులు అన్వేషణ చేపట్టారు. 2006 గట్టు మండలంలో, 2014లో కర్ణాటక రాష్ట్రం ఈడుపునూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదడంతో అధికారులు పాత కేసులను తిరగదోస్తున్నారు. ఇన్నాళ్లు వ్యాపారం, రాజకీయం చేస్తున్నట్లు కనిపించిన ఇతను.. ఎవరికీ తెలియనీయకుండా నేరచరిత్రను కొనసాగిస్తున్నట్లు తాజా హత్యలతో బయటపడింది.

పాత కేసులపై ఆరా..

2006లో ఎర్రప్ప, 2014లో తాయప్పను హత్య చేసి తప్పించుకున్నాడు. ఇదే క్రమంలో మాజీ సర్పంచ్‌ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఎట్టకేలకు దొరికాడు. ఈ క్రమంలో పైరెండు పాత కేసులపై ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. 2006లో నమోదైన కేసు ఇక్కడి జిల్లాలోని గట్టు పోలీసు స్టేషన్‌ కావడంతో అప్పటి ఎఫ్‌ఐఆర్‌, కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌, కేసులోని నిందితులు, సాక్షుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు అప్పటి విచారణ అధికారులు అనుసరించిన అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడి జిల్లాలో కేసు నమోదైన క్రమంలో మిల్లు వీరన్న ప్రమేయాన్ని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారా.. లేక రాజకీయ ఒత్తిళ్లతో వదిలేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు 2014లో తాయప్పను కారులోనే హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రం ఈడుపునూర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో రోడ్డు ప్రమాదంగా చీత్రికరించి అక్కడి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఈ కేసు కర్ణాటకలో నమోదు కావడంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈడుపునూర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్‌, రోడ్డు ప్రమాదం చేసిన క్రమంలో ఏ వాహనం ఇలా అనేక ప్రశ్నలతో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మాజీ సర్పంచ్‌ హత్య కేసులో మిల్లు వీరన్న ఏ–1గా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. హత్య చేయించిన విధానం, సీసీ ఫుటెజీలు, కాల్‌ డేటా, సుపారీ గ్యాంగ్‌కు ఇచ్చిన నగదు, తప్పించుకునేందుకు వినియోగించిన వాహనాలు, ఇద్దరి మధ్య వైర్యం, రాజకీయ మనస్పర్థాలు తదితర నివేదికలు సేకరించారు. తాజాగా రెండు హత్యల విషయం తెలియడంతో దానికి సంబంధించి ఆధా రాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తంగా కేసులో వీరన్న చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. హ త్యకు సహకరించిన నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

కదులుతున్న డొంక 1
1/1

కదులుతున్న డొంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement