డయాలస్ట్రెస్!
నాటువైద్యంతో
మరిన్ని ఇబ్బందులు..
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ బాధితులు
పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు.
రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్‌లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్‌లో 963, డిసెంబర్‌లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బడం. ఇది 50 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుంది.
మూత్ర విసర్జన దారిలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
రసాయన అవశేషాలున్న ఆహార పదార్థాలు తినడం, పొగాకు, ధూమపానం, గుట్కా వినియోగం చేయడం
కలుషిత నీటిని తాగడంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి సమస్యగా మారుతుంది. నాటువైద్యంతో సైతం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.
ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ పరీక్షలు ప్రతి మూడు నెలలకోసారి చేసుకోవాలి. సిరామ్ పరీక్షతో కిడ్నీ పనితీరు తెలుస్తుంది. ప్రస్తుతం చాలా మంది సరైన సమయంలో పరీక్షలు చేసుకోకపోవడం వల్ల బాధితులు పెరుగుతున్నారు. నాటువైద్యం ఆశ్రయిస్తే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం బాధితులకు వారంలో మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నాం. మహబూబ్‌నగర్‌లో 15, ఆత్మకూర్ 10, అలంపూర్ 15, బాలానగర్ 20, గద్వాల 10, నాగర్‌కర్నూల్10, నారాయణపేట 20, కొల్లాపూర్‌లో 15మందికి డయాలసిస్ చేయడానికి ఖాళీలు ఉన్నాయి. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. – సిబాతుల్లా,
క్లస్టర్ మేనేజర్ ఉమ్మడి జిల్లా
వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికం
అధునాతన పరికరాలున్నా..
వైద్యులు కరువు
గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స


