పకడ్బందీగా ఓటరు జాబితా | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓటరు జాబితా

Jan 8 2026 7:09 AM | Updated on Jan 8 2026 7:09 AM

పకడ్బందీగా ఓటరు జాబితా

పకడ్బందీగా ఓటరు జాబితా

గద్వాల: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన అనంతరం అధికారులపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నాలుగు మున్సిపాలిటీలలో ఓటర్ల ముసాయిదా జాబితాను వార్డుల వారీగా పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్టోబర్‌ 1, 2025 నాటి ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రతిఓటరును వారి నివాస భౌగోళిక పరిధి ఇంటి నంబర్‌, వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే నమోదు చేయాలన్నారు. ఒకవార్డులో నివసిస్తూ మరో వార్డులో నమోదైన ఓట్లను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల నమోదైన ఓట్లకు ప్రత్యేకంగా మ్యాపింగ్‌ నిర్వహించాలన్నారు. ప్లాట్‌నంబర్‌ ఆధారంగా నమోదైన ఓటర్లను గుర్తించి మ్యాపింగ్‌ చేయాలని, పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లకు సులభంగా చేరుకునేలా ఉండాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో నామినేషన్‌, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించారు. మున్సిపాలిటీలో రాజకీ య పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాల ని సూచించారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ డీసీఈవో నాగేంద్రం, మున్సిపల్‌ కమీషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement