సమాజంలో భాగస్వాములు కావాలి
గద్వాల(ధరూరు): ఉపాధ్యాయులు సమాజంలో భాగస్వాములు కావాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని జాంపల్లి గ్రామంలో పాఠశాల కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అఽథితిగా హాజరై మాట్లాడారు. సొంత నిధులతో ప్రహరీ నిర్మించిన పాఠశాల హెచ్‌ఎం రేవతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ధరూరులో పనిచేసిన సందర్భంలోనూ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు మరమ్మతు చేయించడంతో పాటు ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అందరూ ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. చేతనైనంత సహాయం చేస్తే ఎందరికో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం డబ్బులు
చెల్లించాలి
గద్వాల: ఖరీఫ్ 2025–26 ధాన్యానికి సంబంధించిన నగదు వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని పౌరసరఫరాల కమిషనర్ సీఫ్టెన్ రవీంద్ర ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, డీఎస్‌వో స్వామికుమార్, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,500
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 391 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8500, కనిష్టం రూ.5080, సరాసరి రూ.6810 ధరలు లభించాయి. అలాగే, 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ.5630 ధర పలికింది. 187 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ.6879, కనిష్టం రూ.1859, సరాసరి రూ.6 869 ధరలు వచ్చాయి. 12 క్వింటాళ్ల వరి (సోన ) రాగా గరిష్టం రూ. 2187, కనిష్టం రూ. 206 1, సరాసరి రూ. 2187 ధరలు లభించాయి.
సమాజంలో భాగస్వాములు కావాలి


