ప్రకృతి సేద్యం దిశగా..
సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం
గద్వాలవ్యవసాయం: సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు పడేలా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) ద్వారా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఏమాత్రం వినియోగించకుండా ప్రకృతి సిద్ధమైన బీజామృతం, జీవామృతం, ఆచ్చాదన తదితర పద్ధతులతో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు గాను జిల్లాలో 40 మంది కృషి సఖిలను వ్యవసాయశాఖ నియమించింది. వీరికి ప్రకృతి వ్యవసాయంపై పూర్తి శిక్షణ అందించి.. ఎంపిక చేసిన క్లస్టర్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2,500 ఎకరాల్లో పంటలు పండించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యంగా ఉండటంతో పాటు భూ సారం పెరుగుతుంది. పెట్టుబడులు సైతం తక్కువ అవుతాయి. పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉండి.. ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పండించిన పంట ఉత్పత్తులతో రైతులకు మంచి ధరలు లభిస్తాయి. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పర్యావరణం పరిరక్షించబడుతుంది.
మండలం క్లస్టర్లు ఎకరాలు
అలంపూర్ 2 250
ధరూర్ 2 250
గద్వాల 2 250
గట్టు 1 125
అయిజ 2 250
కేటీదొడ్డి 1 125
ఇటిక్యాల 1 125
ఎర్రవల్లి 2 250
మల్దకల్ 2 250
మానవపాడు 2 250
రాజోళి 1 125
ఉండవెల్లి 1 125
వడ్డేపల్లి 1 125
జిల్లాలో మండలాల వారీగా ప్రకృతి సేద్యం ఇలా..
జిల్లాలో మొదటి విడతగా 2,500 ఎకరాల్లో సాగు లక్ష్యం
ఎన్‌ఎంఎన్‌ఎఫ్ ద్వారా 40 మంది కృషి సఖిల నియామకం
పూర్తి శిక్షణ అందిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
ప్రకృతి సేద్యం దిశగా..


