క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి
ఎర్రవల్లి: క్రీడలతో పోలీస్ సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్‌లో కమాండెంట్ జయరాజు ఆధ్వర్యంలో వార్షిక స్పోర్ట్స్ మీట్– 2026 నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ కమాండెంట్‌తో కలిసి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, క్రీడలు వేర్వేరు కాదని, మన జీవితంలో భాగమన్నారు. క్రీడల వల్ల కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరమని తెలిపారు. క్రీడల వల్ల సిబ్బందిలో క్రమశిక్షణ, సమన్వయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
సిబ్బందిలో స్నేహాభావం పెరుగుతుంది..
స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో స్నేహాభావం పెరుగుతుందని కమాండెంట్ జయరాజు అన్నారు. పోటీలో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఇందులో 100 మీటర్లు, 400 మీటర్లు, 4.400 రిలే, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, జావలిన్‌త్రో, 5 కే రన్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాలం సిబ్బంది ఆయా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణి, సీఐ రవిబాబు, అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.


