యూరియా కొరత రానివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

యూరియా కొరత రానివ్వొద్దు

Jan 7 2026 7:35 AM | Updated on Jan 7 2026 7:35 AM

యూరియా కొరత  రానివ్వొద్దు

యూరియా కొరత రానివ్వొద్దు

గద్వాల(ధరూరు): రబీలో రైతులకు ఎలాంటి యూరియా కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్‌ అన్నారు. మంగళవారం ఆయన ధరూరు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్‌ రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద విధిగా స్టాక్‌బోర్డుతో పాటు ధరల పట్టికను ఏర్పాటు చే యాలన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. అంతకు ముందు రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతు జయరామాచారిని సన్మానించారు. ప్రతి రైతు సేంద్రీయ సాగువైపు మొగ్గు చూపాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement