పకడ్బందీగా ధనధాన్య కృషి నమోదు
గద్వాల: ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. పీఎండీడీకేవై అమలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, నమోదు చేసే సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి స్పష్టంగా ఉండాలన్నారు. అదేవిధంగా కేంద్రం నిర్వహించే అన్ని వీడియో కాన్ఫరెన్స్‌లలో సంబంఽధిత శాఖలు తప్పక పాల్గొలన్నారు. లక్ష్యాలను సాధించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పీడీఎండీడీకేవై అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఏవో సక్రియనాయక్, ఏడీఏ సంగీతలక్ష్మీ, మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, ఉద్యావనశాఖ అధికారి అక్బర్, పరిశ్రమల అధికారి రామలింగేశ్వర్‌గౌడ్, ఎల్‌డీఎం శ్రీనివాస్‌రావు, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాసులు ఉపాధికల్పన జిల్లా అఽధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు
ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో సమానహక్కులు గౌరవం భద్రత కల్పించడమే ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు ప్రధాన ఉద్ధేశమని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈకార్డు ద్వారా ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యాసహాయం, ఉపాధి అవకాశాలు ఆరోగ్యసేవలు వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చన్నారు. అర్హులైన ట్రాన్స్‌జెండర్లు సంబంధిత ప్రభుత్వ పోర్టల్ జ్ట్టి ఞ.్టట్చ ుఽటజ్ఛ ుఽఛ్ఛీట.ఛీౌట్జ్ఛ.జౌఠి.జీ ుఽ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ జిల్లా అధికారి సునంద, ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.


