ఒకేరోజు ఆరు సాధారణ కాన్పులు
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే జంకే వారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. అధునాతన వసతులతో మెరుగైన వైద్యం అందిస్తూ ప్రైవేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోవడంలేదు. తాజా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ధరూరు పీహెచ్‌సీలో ఆదివారం ఒక్కరోజే ఆరుగురు గర్భిణులకు సాధారణ కాన్పులు చేశారు. ఆరుగురు శిశువులు, తల్లులు క్షేమంగా ఉన్నారని వైద్యురాలు అయేషాబేగం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. – ధరూరు


