నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మానవపాడు: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పల్లెపాడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 124 మందిలో 77మంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలిచారని, 17మంది స్వతంత్య్ర అభ్యర్థుల్లో 12మంది కాంగ్రెస్ పార్టీలోనే చేరారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్‌కార్డులు ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మహ్మద్ సిరాజ్, జగన్‌మోహన్‌నాయుడు, వెంకటేశ్వర్లు, బీసీరెడ్డి, మాస్తన్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.


