రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
గద్వాల క్రైం: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏఎంవీఐ జానకిరాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు రోడ్డు భద్రత మాసోత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. కారు, బైక్ నడిపే క్రమంలో సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలని, వాహనానికి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి, ఫోన్‌లో మాట్లాడుతూ, నిద్రలేమి కారణాలతో డ్రైవింగ్ చేయడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, క్షేమంగా ప్రయాణం చేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, సిబ్బంది రుషి, గోవిందు పాల్గొన్నారు.


