నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అలంపూర్/ఎర్రవల్లి/మానవపాడు: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అనధికార ఔషధాలను విక్రయించినా, ప్రిస్కిప్సన్ లేకుండా హైగర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను విక్రయించినా చర్యలు తప్పవని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రఫి అన్నారు. శనివారం డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిణి అంజుమ్ అబిదా ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి మండలంలోని మెడికల్ దుకాణాల్లో జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు వినయ్, మొహమ్మద్. రఫీ, రష్మి, విశ్వంత్‌రెడ్డి తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. షాపు లైసెన్స్‌లు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయ వివరాలను పరిశీలించారు. ఆర్‌ఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించి మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని తెలపారు. ప్రభుత్వ నిభందనలను పాటించకుండా రోగులకు తెలిసీ తెలియని చికిత్సలు చేసి వారికి నిషేదిత ఔషదాలను విక్రయించినా లేదా చికిత్సకు వాటిని వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొత్తం 9 మెడికల్ దుకాణాల్లో విక్రయాల్లో ఉల్లంఘనలు గుర్తించినట్లు పేర్కొన్నారు. సేల్‌బిల్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా హైగర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ విక్రయించినట్లు తెలిపారు. ఒక మెడికల్ షాప్‌లో ఫిజీషియన్ శాంపిల్స్ తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ దుకాణాల్లో సంబంధిత రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, క్రయవిక్రయాలను, లైసెనన్స్ నిబంధనలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిపారు.


