బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ఎస్పీకి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి
గద్వాల క్రైం: పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, సమస్యాత్మక కేసులను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం వహించొద్దని, నిందితులకు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేయాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిఘా, గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, భూ సంబంధ కేసులపై జోక్యం వద్దన్నారు. అనంతరం ఎస్పీకి పలువురు సిబ్బంది నూతన సంవత్సర శుభకాంక్షలు తెలయజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్‌ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు 2013 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ (జూనియర్ జిల్లా అడ్మిని స్ట్రేటివ్ గ్రేడ్) సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులులు జారీ చేసింది. నేటి నుంచి ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీని జిల్లా పోలీసుశాఖ సిబ్బంది ప్రత్యేకంగా ఆభినందించారు.


