తెగ తాగేశారు..!
● న్యూ ఇయర్ వేడుకల్లో
మద్యం ప్రియుల జోష్
● 24 గంటల్లో
రూ.కోటిన్నర మద్యం అమ్మకాలు
గద్వాలటౌన్: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి యువత బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. మద్యం కొనుగోళ్లు మాత్రం రికార్డు స్థాయిలో సాగాయి. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాగడం మానేద్దాం అని అనుకునే వారు.. బీరు లేని సంబరమేముందని భావించే వారు.. మద్యం ప్రియులు అంతా కలిసి జిల్లా పరిధిలో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఒక్కరోజులోనే రూ. కోటిన్నర వరకు మద్యం అమ్మకాలు జరిగాయంటే ఎంత తాగేశారో తెలుసుకోవచ్చు. బుధవారం రాత్రి గద్వాల పట్టణంతో పాటు మండల కేంద్రాల్లోని అనేక ప్రాంతాలు మందుబాబులతో కిటకిటలాడాయి. నిబంధనలన్ని తుంగలోకి తొక్కి కొంత మంది అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రహస్య కేంద్రాల్లో విక్రయాలు చేశారు. ఎకై ్సజ్ శాఖ రాబడులకు ఢోకా లేకుండా జోరుగా వ్యాపారం జరిగింది. మద్యం మత్తులో యువత రోడ్లపైకి చేరి చిందులేస్తూ, ఇతరులకు ఇబ్బందులను సృష్టించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పట్టణంలో ముమ్మరంగా గస్తీ నిర్వహించారు.


