బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
గద్వాల క్రైం: బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు శ్రమించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సీడబ్యూలసీ, సీడీపీఓ, డీసీపీఓ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించాలని, ఎవరైన 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చిన్నారుల భవిష్యత్తు పరిరక్షణ దిశగా ఆపరేషన్ స్మైల్ పని చేస్తుందన్నారు. 12వ ఆపరేషన్ స్మైల్‌లో రెండు బృందాలు విధిగా విధులు నిర్వహిస్తాయన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైన బాలలను పనిలో చేర్చుకున్నట్లు తెలిస్తే పోలీసుశాఖకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సహాదేవుడు, శైలజ, దీప్తి, వెంకటస్వామి సిబ్బంది తదితరులు ఉన్నారు.


