గడువులోగా పూర్తయ్యేనా?
పట్టణాల్లో నత్తనడకన ‘అమృత్ 2.0’ పనులు
● రక్షిత, సుస్థిర నీటి సరఫరాయేపథకం లక్ష్యం
● గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికలకు రూ.88.74 కోట్లు మంజూరు
పనులు వేగవంతం చేస్తాం..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరుగుతున్న అమృత్ 2.0 పథకం పనుల వేగాన్ని పెంచుతాం. సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల పనులు ఆగాయి. మళ్లీ చేపట్టాం. పైపులైన్ పనులు సైతం కొనసాగుతున్నాయి. పనులు గడువులోగా పూర్తి కావాలన్న ఆలోచన కాకుండా నాణ్యతగా చేయాలన్న తలంపుతో ఉన్నాం. – విజయభాస్కర్‌రెడ్డి,
ఈఈ, ప్రజారోగ్యశాఖ
గద్వాలటౌన్: మున్సిపల్ పట్టణాలలో రక్షిత, సుస్థిర తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ‘అమృత్ 2.0’ పథకం తీసుకొచ్చాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ పథకం కింద భారీగా నిధులు కేటాయించాయి. అంతా బాగున్నా.. జిల్లాలో ఈ పథకం కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంతో గడువులోగా పూర్తి కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.88.74 కోట్లతో పనులు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అయిజ మినహా గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ‘అమృత్ 2.0’ పథకం కింద ఎంపికయ్యాయి. మూడు మున్సిపాలిటీలకు గాను మొత్తం రూ.88.74 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి నీటి ట్యాంకులు నిర్మించేందుకు నిర్ణయించారు. ప్రజారోగ్యశాఖ రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచింది. నిర్మాణ పనులన్నీ ఒకే సంస్థకు అప్పగించారు. తాగునీటి ట్యాంకులు, పైపులైన్ పనులు, ఫిల్టర్‌బెడ్ల నిర్మాణం, మరమ్మతులు తదితర పనులు వేగవంతంగా కొనసాగాల్సి ఉండగా.. నెమ్మదిగా సాగుతున్నాయి. కొన్ని చొట్ల పనులు ఇంకా మొదలే కాలేదు. ఇలాగే పనులు సాగితే గడువులోపు పనులు పూర్తి చేయడం కష్టతరమే.
గడువులోగా పూర్తయ్యేనా?
గడువులోగా పూర్తయ్యేనా?
గడువులోగా పూర్తయ్యేనా?


