30 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి
అయిజ: 30 పడకల ఆస్పత్రి ప్రారంభిస్తే చుట్టుపక్కల మండలాల ప్రజలకు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించ తలపెట్టిన 30 పడకల ఆస్పత్రి భవనాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాభుత్వ ఆస్పత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా, సులబ్ కాంప్లెక్స్‌లా మారిందని మండిపడ్డారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి 30 పడకల ఆస్పత్రినిర్మాణం పూర్తిచేసి ప్రారంభించాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భగత్‌రెడ్డి, గోపాలకృష్ణ, లక్ష్మణ్‌గౌడ్, అంజి, ఖుషి, బసన్న గౌడ్, నరసింహులు, కృష్ణ, రఘు పాల్గొన్నారు.


