
వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
అలంపూర్: ప్రభుత్వ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం కర్నూలులోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, బీసీ వసతిగృహాల వార్డెన్‌లతో ఆయ సమీక్షించారు. ఈ సందర్భంగా హాస్టళ్ల వారీగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అయిజ మండలం టీటీదొడ్డికి చెందిన ఉరుకుందమ్మకు శస్త్రచికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి మంజూరైన రూ. 5లక్షల ఎల్‌ఓసీ, అదే గ్రామానికి చెందిన ఎద్దుల రాముడు శస్త్రచికిత్స నిమిత్తం రూ. 2.20లక్షల ఎల్‌ఓసీని ఎమ్మెల్యే అందజేశారు.