
కేన్సర్ పేషంట్‌ను.. గోలీలకూ డబ్బుల్లేవు..
పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్‌తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే కేన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు.
– గోపాల బొజ్జమ్మ,
బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి
●