ఆటల్లేవ్‌.. పోటీల్లేవ్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఆటల్లేవ్‌.. పోటీల్లేవ్‌ !

Aug 11 2025 1:14 PM | Updated on Aug 11 2025 1:14 PM

ఆటల్లేవ్‌.. పోటీల్లేవ్‌ !

ఆటల్లేవ్‌.. పోటీల్లేవ్‌ !

ఇక్కడ చిత్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో ‘క్రీడా ప్రాంగణం’ అని కనిపిస్తుంది కదా ఇది రాయాపురం గ్రామంలోనిది. కానీ, అక్కడ బోర్డు తప్పా మైదానం లేదు. పైగా బోర్డు నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే నూతన పశువైద్యశాల భవనం కనిపిస్తుంది. అక్కడ పశువైద్య శాలనే కొనసాగుతోంది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల పక్కనే అప్పట్లో క్రీడా

ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల గేటు ముందు కేవలం క్రీడా ప్రాంగణం బోర్డును మాత్రమే పెట్టి వదిలేశారు. ఆటలు ఆడుకునేందుకుకు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ఎలాంటి హద్దురాళ్లను ఏర్పాటు చేయలేదు. కేవలం క్రీడా ప్రాంగణం బోర్డును మాత్రమే పెట్టి

వదిలేశారు. ఆ స్థలం పక్కనే కొత్తగా పశువైద్యశాల భవనం నిర్మించారు. ముందు చూస్తే క్రీడాప్రాంగణం బోర్డు.. లోపల పశువైద్యశాల భవనమా అంటూ చూసే వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తగా చూసే వారికి కాస్త వింతగా అన్పించినా.. జిల్లాలో చాలామటుకు క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే నిరుపయోగంగా మారాయి.

గట్టు: మట్టిలో మాణిక్యాల్లాంటి గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. అయితే వీటి నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా తయారైంది. ఈ క్రీడా ప్రాంగణాలు కేవలం గ్రామాల్లో అలంకారప్రాయంగా మారాయి. కేవలం వీటికి బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల కనీసం ఆటలు ఆడుకునేందుకు భూమిని కూడా చదును చేయకుండా వదిలేశారు. వీటిలో ఇప్పటికి ఆటలు ఆడుకునేందుకు అనువుగా పరిస్థితులు లేకపోవడం గమనార్హం. పేరుకే ఇవి క్రీడా ప్రాంగణాలు. ఏ ఒక్క రోజు కూడా వీటిలో క్రీడలను నిర్వహించిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 280 క్రీడా ప్రాంగణాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లుగా అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించుకునేందుకు అనువుగా వీటిని ఏర్పాటు చేశారు.

ఉపయోగంలోకి తేవాలి

గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడాప్రాంగణాల్లో మౌలిక వసతులను కల్పించి, ఆటలు అడుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలి. ప్రభుత్వం ప్రతి ఏటా గ్రామీణ, మండల స్థాయిల్లో క్రీడలను నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి, వారికి సరైన ప్రోత్సాహాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లెల్లో కొత్తగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలి.

– రామకృష్ణ, ఆలూరు

సౌకర్యాలు కల్పించాలి

గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు, యువకులు ఈ క్రీడాప్రాంగణాల్లో క్రీడలు ఆడుకునే విధంగా అధికార యాంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడా ప్రాంగణాల్లో క్రీడలను నిర్వహించడం ద్వారా ప్రతిభ కల్గిన గ్రామీణ క్రీడాకారులను గుర్తించవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సాయి, గట్టు

ఊరికి దూరంగా..

క్రీడల పట్ల ఆసక్తిని కల్గించి, ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను గుర్తించేందుకు వీలుగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు ప్రస్తుతం నిరూపయోగంగా మారాయి. గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించి, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రీడా ప్రాంగణాలు కొన్ని గ్రామాలకు దూరంగా ఉండడంతో పాటుగా క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేక ఆటలు ఆడుకోవడం లేదు. యువత కూడా ఈ మైదానాల్లో ఆడుకునేందుకు ఇష్టపడడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 296 క్రీడాప్రాంగణాలను మంజూరు చేయగా.. అందులో 280 పూర్తి చేసుకున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. మరో 16 చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసిన చోట ప్రవేశ ద్వారాల దగ్గర పెద్ద సైజులో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇక్కడ ఇప్పటి దాకా ఏ క్రీడా పోటీలను నిర్వహించిన దాఖలాలు లేవు. కనీసం ఆటలు ఆడుకునేందుకు అనుకూలంగా క్రీడామైదానాలను కూడా సిద్దం చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన క్రీడాప్రాంగణాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.

జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు

ఆటలకు అనువుగా లేనిక్రీడా మైదానాలు.. నిర్వహణ కరువు

జిల్లా వ్యాప్తంగా

296కుగాను 280 క్రీడా మైదానాల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement