
పైసలిస్తేనే.. ఫైల్ కదిలేది!
కొన్ని ప్రభుత్వ శాఖల్లో రాజ్యమేలుతున్న అవినీతి
రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లపై
దృష్టి సారించాలి
జిల్లాలోని తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు బాహాటంగానే వెల్లువెతున్నాయి. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. రియల్ భూం ఉన్న మండలాల్లో తహసీల్దార్లకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రధానంగా గద్వాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చుతూ... తమ జేబులను నింపుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గద్వాల జిల్లాలోని ఈ కార్యాలయాలపై ఏసీబీ అఽధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.