చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి

Aug 8 2025 7:51 AM | Updated on Aug 8 2025 7:51 AM

చేనేత

చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి

గద్వాల టౌన్‌: చేనేత రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఎక్కడా లేని విధంగా ఈ రంగంలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందని కలెక్టర్‌ సంతోష్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. గద్వాల జరీ చీరలు ఖండాంతర ఖ్యాతిని పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత అందాలు మన సంస్కృతికి చిహ్నాలన్నారు. వారసత్వంగా వచ్చిన చేనేతను కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేలా ప్రోత్సహించాలన్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్డు, మిత్రా తదితర కంపెనీల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా గద్వాల చేనేత విశ్వవ్యాప్తం అయిందని, దీన్ని మరింత విస్తృతం చేయడానికి కృషిచేస్తామన్నారు. జిల్లాలో 2,950 మగ్గాలకు జియోట్యాగ్‌ ఉందని చెప్పారు. నేతన్నకు చేయూతలో ఆరు వేల మంది కార్మికులు ఎంపికయ్యారన్నారు. చేనేత రుణమాఫీలో 1,761 మంది కార్మికులకు రూ. 12 కోట్లు మంజూరయ్యాని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ వ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు మాత్రమే ఎంపికయ్యాయని, అందులో గద్వాల చీరలకు ప్రాధాన్యత లభించడం హర్షించదగిన విషయమన్నారు.

చేనేత వస్త్రాలను

ఆదరించాలి

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రలను ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని నేతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. చేనేత జౌళిశాఖ అధికారి గోవిందయ్య చేనేత అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అందుబాటులో ఉండటం లేదని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, రాయితీలను అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా, అంతకుముందు చేనేత, జౌళీశాఖ అధ్వర్యంలో పట్టణంలో ర్యాలీని ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక పాతబస్టాండ్‌ నుంచి ప్రధాన రహదారుల గుండా చేనేత కార్మిక సంఘం ప్రతినిధుల ర్యాలీ కొనసాగింది. అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగంలో వృత్తి నైపుణ్యాలు కనబర్చిన పలువురు చేనేత కార్మికులకు ప్రశంసా పత్రం అందజేశారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చేనేత వస్త్రాలతో విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది. కార్యక్రమంలో చేనేత శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత క్లస్టర్‌ చైర్మన్‌ రామలింగేశ్వర కాంమ్లే తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులపై

ప్రత్యేక శ్రద్ధ అవసరం

గద్వాలటౌన్‌: విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ సంతోష్‌ సూచించారు. గురువారం జమ్మిచేడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల చేత ఇంగ్లీష్‌ పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని ఆరా తీశారు. బాగా చదువుకోవాలని విద్యార్థినీలకు సూచించారు.

ఆకట్టుకున్న విద్యార్థినుల

సాంస్కృతిక ప్రదర్శన

చేనేత ఫ్యాషన్‌ షో

–8లో u

కలెక్టర్‌ సంతోష్‌

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత

గద్వాల న్యూటౌన్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఉంచాలని కలెక్టర్‌ బీ.ఎం. సంతోష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను కలెక్టర్‌ సంబందిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును చూశారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి 1
1/1

చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement