ఉత్తీర్ణత శాతం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తీర్ణత శాతం పెంచాలి

Aug 7 2025 7:24 AM | Updated on Aug 7 2025 7:36 AM

ఉత్తీర్ణత శాతం పెంచాలి

ఉత్తీర్ణత శాతం పెంచాలి

ధరూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిసరాలతో పాటు కంప్యూటర్‌ గదిని, లైబ్రరీ, వంట గదితో పాటు తరగతి గదులను, వాటర్‌ ఫిల్టర్‌ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పస్తుత సమాజంలో ప్రతీది ఆన్‌లైన్‌, కంప్యూటర్‌తో ముడిపడి ఉందని విద్యార్థులు కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్టు ఆద్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కొరకు తెచ్చిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీంద్రబాబు, ఎంపీడీఓ మంజూల, జీహెచ్‌ఎం ప్రతాప్‌రెడ్డి, ట్రస్టు చైర్మన్‌ రత్నసింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.

మెడికల్‌ ఏజెన్సీలో

తనిఖీలు

గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో వెలసిన మెడికల్‌ ఏజెన్సీలో జిల్లా ఇన్‌చార్జ్‌ ఔషధ నియంత్రణ అధికారి వినయ్‌ బుధవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో మందుల క్రయ విక్రయాలు, సరఫరాల రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో సుంకులమ్మ మెట్‌ సమీపంలోని ఓ ఏజెన్సీ నిర్వాహకులు మల్దకల్‌, కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూర్‌ మండలం తదితర ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలుగా ఉన్న వ్యక్తులకు మందులు సరఫరా చేసేందుకు వారితో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిసిందని, అలాగే, జిల్లా కేంద్రంలోని వివిధ మెడికల్‌ దుకాణాలకు మందులు పంపిణీ చేసినట్లు రికార్డులలో నమోదు చేసినట్లు వివరించారు. కంపెనీల నుంచి కొనుగోలు చేసిన మందుల బిల్లులు, ఇప్పటి వరకు విక్రయాలు చేసిన వివరాలపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఆర్‌ఎంపీలకు మందులు సరఫరా చేయడం తనిఖీల్లో వెల్లడైందన్నారు. దీంతో మెడికల్‌ ఏజెన్సీ లైసెన్స్‌ను 15 రోజుల పాటు సస్పెండ్‌ చేశామన్నారు. మందుల క్రయ విక్రయాలపై నిర్వాహకుల నుంచి రికార్డులను సీజ్‌ చేశామని, తదుపరి చర్యలపై త్వరలో తెలియజేస్తామని వినయ్‌ పేర్కొన్నారు.

సీపీఐ సభలు వాయిదా

గద్వాల: సీపీఐ జిల్లా మహాసభలు ఈ నెల 14వ తేదీకి వాయిదా పడినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. 7వ తేదీన జరగాల్సిన సభలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

చదువుతోనే గుర్తింపు

గద్వాలటౌన్‌: జీవితంలో మనిషిని ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడేది చదువేనని, విద్య నేర్చుకున్నప్పుడే సమాజావృద్ధి జరుగుతుందని ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ చవ్వా వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ కళాశాలలో పీజీ రెండో సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం విద్యా ర్థులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్లు అరవిందు, మంగళగిరి శ్రీనివాసులు, గణేష్‌, గోపినాథ్‌, రాథోడ్‌, మహేందర్‌, రవిషెరీన్‌, రఫీ, గట్టయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement