
రైతులపై ఆర్థిక భారం..
2024 వానాకాలం నుంచి రాయితీపై కూరగాయల, ఎండుమిర్చి విత్తనాలను అందిస్తామని ప్రస్తుత సర్కార్ పేర్కొంది. అయితే గతేడాదితో పాటు ఈసారి కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. సర్కార్ మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఉద్యాన రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రధానంగా కూరగాయలు సాగుచేసేది సన్న, చిన్నకారు రైతులే. ఏటా విత్తనాలకే రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు వెచ్చిస్తున్నారు. రాయితీ ఉన్నప్పుడు రూ. 3వేల నుంచి రూ. 4వేలు మాత్రమే ఖర్చయ్యేదని రైతులు అంటున్నారు. రాయితీపై విత్తనాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇక ఎండుమిర్చి రైతుల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఏటా ధరలు రాక నష్టపోతున్నారు. ఇక కంపెనీలు, రకాలను బట్టి విత్తనాలకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు మిర్చి రకాలు కేజీ రూ. 600 నుంచి రూ. 900 వరకు ఉంది. ఎకరాకు కనీసంగా 3కిలోలు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాలను కంపెనీలు పాకెట్ల రూపంలో ఇస్తారు. ఒక పాకెట్ ధర రూ.700 నుంచి రూ.900 వరకు ఉంది. ఎకరాకు 12 పాకెట్లు కావాల్సి ఉంటుంది. ఇలా ఉద్యాన రైతులు విత్తనాలకు కోసం అధికంగా వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యాన రైతులకు రాయితీ అవకాశం కల్పిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.