నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం
గద్వాల: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల పట్టణ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్‌తో పనుల తీరుతెన్నులపై అడిగి తెలుసుకున్నారు. కళాశాల వసతులకు అనుగుణంగా జీ ప్లస్ వన్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణం పనులకు సంబంధించిన మ్యాప్ ద్వారా పనుల వివరాలను అఽడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, అదేవిధంగా నిర్దిష్ట కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ హనుమంతమ్మ, డీఈ శ్రీనివాసులు, ఏఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


