‘ఉపాధి’ కూలీలకు అధిక వేతనం వచ్చేలా చూడాలి
ఎర్రవల్లి/ఇటిక్యాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకంలో పనిచేసే కూలీలతో సరైన కొలతల ప్రకారం పనులను చేయించి అధిక వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. గురువారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో పలు చోట్ల జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంత రైతుల యొక్క రవాణా సౌకర్యాల మెరుగుదలకు అవసరమయ్యే పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు అబ్దుల్ సయ్యద్‌ఖాన్, అజార్ మెహియుద్దీన్, టిఎలు కృష్ణ, పురేందర్ తదితరులు పాల్గొన్నారు.


