ముగిసిన ఆలయ భూమి కౌలు వేలం
అలంపూర్: పట్టణంలోని ఆలయ సముదాయంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి చెందిన భూముల వేలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అదనపు కమిషనర్ మధనేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించినట్లు ఈఓ పురేందర్‌కుమార్ తెలిపారు. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో 34 సర్వే నెంబర్లలో 28 సర్వే నంబర్ల ద్వారా వేలంలో రూ.39.59లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. మిగిలిన 6 సర్వే నంబర్లకు సరైన ధర రాకపోవడంతో మే 2న రెండో సారి కౌలు వేలం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీసూర్య నారాయణస్వామి ఆలయానికి చెందిన 2 సర్వే నంబర్లకు నిర్వహించిన వేలంలో రూ.6.77లక్షలు, కాశీపురం ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 2 సర్వే నంబర్ల భూములకు రూ.2.11 లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. ఆలయ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు నాగశిరోమణి, జగదీశ్వర్‌గౌడ్, ఎ.వెంకటేశ్వర్లు, జగన్మోహన్ నాయుడు, జి.వెంకటేశ్వర్లు, గోపాల్ తదితరులు ఉన్నారు.


