గట్టులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రవీందర్‌రావు
గట్టు: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్‌రావు సూచించారు. ఆదివారం గట్టులో బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సీఎం కేసీఆర్ విజన్ వల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు రాజకీయాలు తప్పా, ప్రజా సంక్షేమం కన్పించదన్నారు. సీఎం కేసీఆర్ కృషి వలన రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పడు నడిగడ్డ అంటేనే కరువుకు నిలయంగా ఉండేదని, ప్రాజెక్టు పుణ్యమా అంటూ పచ్చని పంటల కారణంగా ఈ ప్రాంతం మరో కోనసీమను తలపిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల వారు ఇక్కడి వచ్చే పరిస్థితి ఉందన్నారు. గట్టు ఎత్తిపోతలను పూర్తి 30వేల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గట్టు మండలంలో రూ.350 కోట్ల వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో మతచిచ్చు పెట్టడడానికి వచ్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. స్టేట్ కన్జ్యూమర్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జంబురామన్‌గౌడు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీలు విజయ్‌కుమార్, రాజారెడ్డి, నజూమున్నీసాబేగం, జెడ్పీటీలు బాసు శ్యామల, రాజశేఖర్ ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


