నిర్వాసితులు చేస్తున్న నిరసన దీక్షలు విరమించేందుకు ప్రభుత్వం తరపున చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే సీఎంఓ అధికారి స్మితాసబర్వాల్ చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను సందర్శించి, బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించి వెళ్లారు. ఆ తర్వాత నిర్వాసిత రైతులు అప్పటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట గద్వాల డీఎస్పీ రైతులను కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. అదేవిధంగా వారం కింద గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నిర్వాసితుల వద్ద నేరుగా భేటీ అయ్యారు. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి న్యాయం చేయించేలా కృషి చేస్తానన్నారు.


