శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

దీనస్థితిలో డీఎంఎఫ్‌టీ

ఉద్యోగులు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల జీవితాలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. విధులకు హాజరవుతూ రోగులకు సేవలందిస్తున్నప్పటికీ ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నెలనెలా రావాల్సిన వేతనాలు నెలల తరబడి నిలిచిపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు భారంగా మారుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ విధులు.. ఈ రెండింటి మధ్య డీఎంఎఫ్‌టీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

వైద్య సేవల్లో కీలకం..

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో డీఎంఎఫ్‌టీ కింద పనిచేస్తున్న ఉద్యోగులు వివిధ విభాగాల్లో కీలక సేవలు అందిస్తున్నారు. క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ టెక్నీషియన్లు, ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలు, అంబులెన్స్‌ డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫార్మసిస్ట్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు 16 మంది ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారితోపాటు చిట్యాల, మహదేవపూర్‌ సీహెచ్‌సీలు, వివిధ పీహెచ్‌సీల్లో కూడా డీఎంఎఫ్‌టీ నిధులతో సుమారు 20కిపైగా వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల నుంచి రోగుల సంరక్షణ, పరీక్షలు, మందుల పంపిణీ వరకు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆస్పత్రి కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్న వీరికి మాత్రం నెలల తరబడి వేతనాలు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

డీఎంఈ పరిధిలోకి మార్చాలని వినతి

తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేవలం పెండింగ్‌ వేతనాలు చెల్లించడమే కాకుండా అర్హత, అనుభవం కలిగిన తమందరినీ డీఎంఈ పరిధిలోకి మా ర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరత్నం, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రావుకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే ఇప్పించడంతోపాటు తమ ఉద్యోగ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని అభ్యర్థించారు. వైద్యసేవలకు అంతరాయం కలగకుండా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను అధికారులు ఇకనైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్‌, సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ఏడు నెలలుగా అందని వేతనాలు

భారంగా కుటుంబ పోషణ

జీతాలు రాకున్నా.. విధులకు హాజరు

డీఎంఈ పరిధిలోకి మార్చాలని

వేడుకోలు

ఏడు నెలలు గా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తీసుకు న్న అప్పులకు వడ్డీలు పెరుగుతుండడం, ఇంటి ఖర్చులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు భారంగా మారుతున్నా యి. ప్రతినెలా జీతం వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నా నిరాశ తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. విధులను నిర్లక్ష్యం చేయలేక, కుటుంబ అవసరా లు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement