భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు క్రమశిక్షణ, సేవా భావం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని.. అందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఎంతో దోహదపడుతుందని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్– సింగరేణి కాలరీస్ జిల్లా అసోసియేషన్, భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన పయోనీరింగ్ అండ్ క్యాంప్ క్రాఫ్ట్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రాజేశ్వర్‌రెడ్డి.. విద్యార్థులు వెదురు కర్రలు, తాళ్లతో రూపొందించిన వాచ్ టవర్, క్యాంప్ క్రాఫ్ట్ నమూనాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. చదువుతోపాటు జీవితానికి అవసరమైన ప్రాయోగిక నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. బృంద స్ఫూర్తితో పనిచేయడం, ప్రకృతితో మమేకం కావ డం, ఆపదలో ఇతరులకు సహాయపడే గుణాలను పెంపొందించుకోవాలని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాలు అందుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని వాచ్ ట వర్ నిర్మాణం, టెంట్ల ఏర్పాటు, వివిధ రకాల ము డులు వేయడం, వెదురు కర్రలు, తాళ్లతో నిర్మాణా లు చేపట్టడంలో శిక్షణ పొందారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎ స్.శ్యామ్‌సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సా యికృష్ణ, ఏఎస్‌ఓసీలు సాయి నిరంజన్, సుధాకర్, లీడర్ ఆఫ్ ది కోర్స్ శక్తికుమార్, శ్రీనివాసరావు, స్వామి, రాజమౌళి, రమేష్, సరిత, లక్ష్మి పాల్గొన్నారు.
జీఎం రాజేశ్వర్‌రెడ్డి


