భూపాలపల్లి: జిల్లాలోని విద్యార్థులు, యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. రాష్ట్రంలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – తెలంగాణ 2026కు సంబంధించిన అధికారిక లోగో, మస్కట్ ‘నీలమణి’ పోస్టర్లను గురువారం ఐడీఓసీలో కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎంతగానో దోహదపడతాయని అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణమన్నారు. వి ద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవడంతోపాటు, తమలోని క్రీడా ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు యువతకు మంచి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు, కా ర్యాలయ సిబ్బంది శివసాగర్ పాల్గొన్నారు.
ప్రతీ కుటుంబానికి ఆర్థిక భద్రత..
అర్హులైన ప్రతీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, మార్గదర్శకాలు, లబ్ధిదారుల నమోదు ప్రక్రియపై కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పథకం అమలులో భాగంగా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల ఉపాధి పొందే కుటుంబ సభ్యులకు సంబంధించి నిర్దేశించిన అర్హతలు, నిబంధనల ప్రకారం నమోదు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, సీపీఓ కిష్టయ్య, డీపీఓ శ్రీలక్ష్మీ, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, ఈడీఎం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


