మల్హర్: రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే రీ–సర్వే చేపడుతున్నామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం జిల్లా ఆయన పర్యటించి రీ–సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సర్వే చేస్తున్న బృంధాల వద్దకు వెళ్లి సర్వే పద్ధతులు, ఆధునిక పరికరాల వినియోగం, భూముల హద్దులు గుర్తించే విధానంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారికి అవగాహన కల్పిస్తూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేలో తేడాలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఆర్‌ఐ, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్


