ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సన్నగా పోస్తున్న బోరు నీటిని చూపిస్తున్న రైతు మల్హర్ మండలంలోని పెద్దతూండ్ల పంచాయతీ పరిధిలోని గాదంపల్లికి చెందిన రైతు రాంపల్లి కుమార్. ఈయనకున్న ఎకరం పొలంలో వరి సాగు చేసి పెట్టుబడికి ఇప్పటి వరకు రూ.40వేలు ఖర్చు చేశాడు. వర్షాలు సమృద్ధిగా కురియక, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు నుంచి నీరు రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటితో 20 గుంటలకు మాత్రమే నీరు అందుతుంది. చివరి మడికి నీరు అందకపోవడంతో పంట ఎండిపోతుంది. ఇక పంటను వదిలేసుకోవాల్సిందేనని, ఇప్పుడే ఇలా ఉంటే యాసంగి పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతున్నాడు.


