కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు | - | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అధికారులు, ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కనీస వర్షాలు కురుస్తాయని రైతులు భావించి 1,09,442 ఎకరాల్లో పత్తిపంట, 1,00,149 ఎకరాల్లో వరి, 13,858 ఎకరాల్లో మిర్చి పంటలను సాగు చేశారు. సాగు ప్రారంభం నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో జలాశయాలు నిండలేదు. అంతేకాక బోర్లు, బావుల్లో నీరు అడుగంటిపోయింది. ప్రస్తుతం వరిపంట పొట్టదశలో ఉండగా చివరి మడికి నీరు లేని పరిస్థితి నెలకొంది. భూమిలో తేమ శాతం పూర్తిగా పడిపోయింది. దీంతో వేల ఎకరాల్లో వరిపంట ఎండిపోతుంది. ఇదిలా ఉండగా ఆకుపచ్చ తెగుళ్ల కారణంగా రైతులు పత్తిపంటపై ఇప్పటికే ఆశలు వదులుకోగా, పూత, కాపు దశలో ఉన్న మిర్చికి నీరందడం లేదు. 5,520 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్‌పామ్‌ పరిస్థితి సైతం ఇలాగే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement