న్యూస్‌రీల్
పక్క ఫొటోలోని రైతు కొత్తపల్లి గోరి గ్రామానికి చెందిన ఐరబోయిన దేవేందర్. తనకున్న నాలుగెకరాల్లో వరిపంట సాగు చేశాడు. ఎరువులు, క్రిమి సంహారక మందులు తదితర పెట్టుబడులతో పాటు కూలీల కోసం రూ.1.20 లక్షల వరకు వెచ్చించాడు. ఎల్‌నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురియలేదు. చెరువులో చుక్కనీరు లేకుండాపోయింది. అటు వర్షాలు కురియక, ఇటు చెరువులో నీరు లేకపోవడంతో ఇబ్బంది తలెత్తుతుంది. ప్రస్తుతం వరిపంట పొట్ట దశలో ఉండగా, మరో మూడు తడులు నీరు కడితే పంట చేతికొస్తుంది. ఈ క్రమంలోనే చెరువులో నీరు లేకపోవడం, పక్కన ఉన్న బోరుల్లో సైతం నీరు అడుగంటిపోవడంతో ఇక వరిపంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడి కూడా రాదని, ఇంతటి కరువు తానెప్పుడూ చూడలేదని వాపోతున్నాడు.


