నేడు మరోసారి ‘సూపర్‌’ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నేడు మరోసారి ‘సూపర్‌’ పరిశీలన

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

నేడు మరోసారి ‘సూపర్‌’ పరిశీలన

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం స్థానంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో దసరా కానుకగా ఓపీ సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో పరిశీలించడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క శనివారం మరోసారి రానున్నట్లు తెలిసింది. గురువారం పరిశీలించిన మంత్రులు ఓపీ సేవల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం సందర్భంగా రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా మరోసారి ఏర్పాట్ల పరిశీలనకు వస్తున్నట్లు సమాచారం. మంత్రులు నేరుగా సూపర్‌ హాస్పిటల్‌ భవనానికి చేరుకుని, వైద్యాధికారులతో కలిసి పరిశీలన చేయనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఎక్స్‌రే, ఆల్ట్రా సౌండ్‌ పరీక్షలు

ఓపీ సేవల కోసం వచ్చిన ప్రజల అవసరాన్ని బట్టి ఎక్స్‌రే, ఆల్ట్రా సౌండ్‌, ఫార్మసీ సేవలను అందుబాటులో ఉంచారు. మిగతా ఏర్పాట్లను కూడా చకచకా చేస్తున్నారు. బ్లడ్‌ టెస్ట్‌లకు మాత్రం ఇక్కడ శ్యాంపిల్స్‌ తీసుకుని, ఎంజీఎంలో చేస్తారని సమాచారం. ఇక సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐతో అడ్మిట్‌ కావాల్సి వస్తే వారిని తరలించేందుకు అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లతో పాటు ఆర్టీసీ రెండు బస్‌లను ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనలతో ఉన్నట్లు సమాచారం.

వారంలో ఎంజీఎం ఓపీ సేవలివే..

సాధారణంగా ఓపీ వైద్యసేవలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ప్రతీ ఆదివారం, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ దినోత్సవం రోజుల్లో ఓపీ సేవలు బంద్‌ చేస్తారు. ప్రస్తుతం సోమవారం, మంగళవారం తప్ప మిగతా రోజుల్లో ఆర్థోపెడిక్‌, మెడికల్‌, సర్జికల్‌, సైకియాట్రి, పిడియాట్రిక్స్‌, ఈఎన్‌టీ, డెర్మటాలజీ సేవలు, మంగళవారం ప్లాస్టిక్‌ సర్జరీ సేవలను అందించడానికి వైద్యులు అందుబాటులో ఉంటారు.

సూపర్‌ స్పెషాలిటీలో..

ప్రతీ సోమ, బుధవారాల్లో సిటీ వ్యాస్కులర్‌ సర్జరీ, గ్యాస్ట్రో, మెడికల్‌ అంకాలజీ, సర్జికల్‌ అంకాలజీ, ప్రతీ మంగళ, గురువారాల్లో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ సేవలు అందిస్తారు. ప్రతీ శుక్రవారం, శనివారం రోజుల్లో ఆయా స్పెషాలిటీలకు సంబంధించిన వైద్యసేవలను రిప్యూ చేస్తారు.

హోమియోపతిక్‌, యూనానీ సేవలు కూడా...

ఎంజీఎంలో ఉన్న హోమియోపతిక్‌, యూనాని వైద్య సేవలు కూడా సూపర్‌లో అందించనున్నారు. ఈ సేవలు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతీరోజు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు లంచ్‌ అవర్‌ ఉంటుంది.

రానున్న మంత్రులు పొంగులేటి, సీతక్క

పెండింగ్‌ పనులపై సమీక్షించే అవకాశం

అందుబాటులో ఎక్స్‌రే,

ఆల్ట్రాసౌండ్‌, ఈసీజీ పరీక్షలు

రక్త నమూనాలు ఇక్కడ..

పరీక్షలు ఎంజీఎంలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement