జిల్లా కేంద్రంలో ఓవైపు నీటి కొరత ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు మిషన్ భగీరథ, కేటీపీపీ పైపులైన్ లీకేజీతో విలువైన తాగునీరు వృథాగా పోతోంది. శ్రీతార రెస్టారెంట్ సమీపంలో పది రోజులుగా పైపులైన్ రెండు ప్రాంతాల్లో లీకవుతున్నా మున్సిపల్, మిషన్ భగీరథ, కేటీపీపీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన నీరు ఇలా రోడ్లపై పారుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని వెంటనే అరికట్టి నీటి వృథాను నివారించాలని కోరుతున్నారు.
– భూపాలపల్లి అర్బన్


