భరోసా కేంద్రం సందర్శన | - | Sakshi
Sakshi News home page

భరోసా కేంద్రం సందర్శన

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని భరోసా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్‌కుమార్‌ గురువారం సందర్శించారు. కేంద్రంలో నమోదవుతున్న కేసుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న సేవలు, కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోర్టు పరిపాలనాధికారి పారిజాతం, ఎస్‌ఐ స్వప్నకుమారి, కోఆర్డినేటర్‌ రమాదేవి, లీగల్‌ కౌన్సిలర్‌ రజిత, సూపరింటెండెంట్‌ రఘురామ్‌ పాల్గొన్నారు.

అంతర్జాతీయ అనాటమీ దినోత్సవం

భూపాలపల్లి అర్బన్‌: అంతర్జాతీయ అనాటమీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అనాటమీ, పాథాలజీ విభాగాల ఆధ్వర్యంలో గురువారం హిస్టో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. సూక్ష్మదర్శినిలో కనిపించే కణజాలాల ఆకృతులను రంగులతో అందంగా తీర్చిదిద్దుతూ వైద్య విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల, ఆస్పత్రి ప్రొఫెసర్లు అభినందించి బహుమతులు అందజేశారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీధర్‌రావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌రెడ్డి, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ పవన్‌కుమార్‌, పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ సురేందర్‌, పాథాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ పావని, అనాటమీ విభాగానికి చెందిన డాక్టర్‌ అజయ్‌ ప్రకాశ్‌, డాక్టర్‌ లూయిస్‌ ఫీబీ పాల్గొన్నారు.

గాజర్ల అశోక్‌ను

పరామర్శించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్‌ అనారోగ్యంతో నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిమ్స్‌ వైద్యులతో మాట్లాడి సరైన వైద్యం అందించాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

విదేశాల్లో ఉద్యోగాలు

భూపాలపల్లి అర్బన్‌: టామ్కామ్‌ ద్వారా విదేశాల్లో నర్సింగ్‌ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైసెన్స్‌డ్‌ ప్రాక్టికల్‌ నర్సులు (ఎల్‌పీఎన్‌), నర్సింగ్‌ టెక్నీషియన్ల (ఎన్‌టీ) పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 20–40 ఏళ్ల వయస్సు, సంబంధిత విద్యార్హతలు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు ఉండాలి. ఎల్‌పీఎన్‌ పోస్టులకు రెండేళ్లు, ఎన్‌టీ పోస్టులకు ఏడాది అనుభవం అవసరమని పేర్కొన్నారు. నెలకు రూ.95,000, రూ.73,000 వేతనం అందించనున్నట్లు వివరించారు. వివరాలకు టామ్కామ్‌ 080 35524946, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం 95024 68800 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

17న జాబ్‌ మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఎఫ్‌3 బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. పిగ్గియో ఏపీఎఫ్‌ ఆటో షోరూంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, మెకానిక్‌ పోస్టుల భర్తీకి మొత్తం 10 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నెలకు రూ.10వేల నుంచి రూ.14వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి భూపాలపల్లిలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తారని, త్రీ వీలర్‌ డ్రైవింగ్‌ తప్పనిసరి కలిగి ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 95024 68800 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement