గణపురం: సాంకేతికతను వినియోగించుకుని నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. గురువారం గణపురం సర్కిల్ కార్యాలయంతో పాటు పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పరిశుభ్రత, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందకు ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గంజాయి, సైబర్నేరాలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ అశోక్ పాల్గొన్నారు. అనంతరం బస్వరాజుపల్లి గ్రామంలో దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


