● కంపెనీస్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: క్రీడా పోటీల్లో పాల్గొంటే క్రీడా సామర్థ్యాలతో పాటు స్నేహభావం పెంపొందించుకోవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. సింగరేణి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్ టోర్నమెంట్లు గురువారం ఏరియాలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. కృష్ణకాలనీ గ్రౌండ్లో ఒలింపిక్ జెండాను ఆవిష్కరించారు. సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ క్రీడాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమంతోపాటు క్రీడలకు సింగరేణి ప్రాధాన్యమిస్తోందన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణతో పాటు జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రామన్ వి.పాఠక్, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్సుందర్, సీనియర్ పీఓ సాయికృష్ణ పాల్గొన్నారు.


