టేకుమట్ల: మండలంలోని రామకిష్టాపూర్(వి)లో కొనసాగుతున్న నాన్–కెడస్ట్రల్ భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన సర్వే ప్రక్రియను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వేగం పెంచాలన్నారు. రైతులు, భూ సర్వే బృందాలు సమన్వయంతో పని చేయాలని, భూ హద్దులను స్పష్టంగా నిర్ధారించి రికార్డుల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజిటల్ భూ రికార్డులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సర్వే ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్ స్వరూపరాణి, రెవెన్యూ, సర్వే సిబ్బంది ఉన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్


