కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి నియోజకవర్గంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, కోతుల నివారణకు చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. పంట చేలు, పండ్లతోటలను ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల వల్ల ప్రమాదాల బారినపడి పలువురు కోమలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాగే వ్యవసాయ సాగు విస్తీర్ణం 5.52 లక్షల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం 3.50 లక్షలకు తగ్గింది. దీనికి కారణం ఎంఎస్పీ లేకపోవడం, కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడమని స్టోరేజీలు పెంచాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలో ప్రస్తావించిన

ఎమ్మెల్యే సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement