సాయుధ పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు | - | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదల కోసం భూపోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల ర్యాలీ, సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లిలోని కొమరయ్య భవన్‌ నుంచి బస్టాండ్‌ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్తూపం వద్ద జరిగిన సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా భూములను పేదలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. నాటి పోరాట స్ఫూర్తితోనే నేడు పేదల భూ సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పో రాటం, అమరవీరుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మోటపలుకుల రమేష్‌, సుధాకర్‌ రెడ్డి, సోతుకు ప్రవీణ్‌, శాంతి, కొరిమి సుగుణ, కౌన్సిలర్‌ వేముల జ్యోతి, నేరెళ్ల జోసెఫ్‌, శ్రీకాంత్‌, అన్నారపు రాజేందర్‌, ఆసిఫ్‌ పాషా,తాళ్ల పోశం, రవికుమార్‌, లావణ్య, శ్రావణి, స్వరూప, నాగమణి, సంధ్య, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement