దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో..
● శిక్షల శాతంలో భూపాలపల్లి,
ములుగు, చార్జిషీట్‌లో మహబూబాబాద్
● నేరాల నియంత్రణలో
మనోళ్ల పెర్ఫార్మెన్స్ వెల్లడి
● ఎఫ్‌ఐఆర్‌నుంచి శిక్షల వరకు
పనితీరుతో మార్కుల శాతం
● అన్ని విభాగాల్లో మెరుగైతేనే
ఉమ్మడి వరంగల్‌లో నేరగాళ్లకు చెక్
సాక్షి, వరంగల్ : నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయడం...ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్‌కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్ వైజ్ యూనిట్స్ పెర్ఫార్మెన్స్ స్కోర్‌కార్డు’ ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని నాలుగు పోలీస్ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో వరంగల్ పోలీసు కమిషనరేట్ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జిషీట్‌ల నమోదులో మహబూబాబాద్ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్‌లో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది.
మహబూబాబాద్
వరంగల్ కమిషనరేట్
కేసు నమోదైన తర్వాత దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియలో అత్యంత కీలక దశ. ఈ విషయంలో మహబూబాబాద్ నాలుగు యూనిట్లలో ముందుంది. ముఖ్యంగా ములుగులో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసే రేటు మిగిలిన యూనిట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశమని పోలీస్ వర్గాలు అంటున్నాయి.
భూపాలపల్లి
58.93
57.04
ములుగు
54.45
46
నేరాలను గుర్తించి నిందితులను పట్టుకోవడంలో జయశంకర్ భూపాలపల్లి ముందుంది. నేరం జరిగిన తర్వాత దాని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో ములుగు మరింత సమర్థంగా పనిచేయాల్సిన అవసరముందని గణాంకాలు చెబుతున్నాయి.
వరంగల్
కమిషనరేట్
దర్యాప్తులో వరంగల్ వేగం...
ఆరు నెలల పనితీరుపై రాష్ట్ర పోలీస్‌శాఖ స్కోర్‌కార్డు
చార్జ్‌షీట్ నమోదు..


