● సబ్‌కలెక్టర్ సౌరబ్ శర్మ
మల్హర్: రెవెన్యూ సేవల్లో జాప్యం ఉండవద్దని కాటారం సబ్‌కలెక్టర్ సౌరబ్ శర్మ అధికారులను ఆదేశించారు. తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయం, తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కా ర్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్ బండి స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్‌కు నిర్వాసితుల వినతి
తాడిచర్ల గ్రామంలో పర్యటించిన కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మను తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాడిచర్ల డేంజర్ జోన్‌లో ఇండ్ల నష్టపరిహారం కోసం, స్థానికుల ఇండ్ల సర్వేలో జరిగిన అవకతవకలపై సర్పంచ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ త్వరలోనే నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేస్తామని, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి సకాలంలో నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ సభ్యులు అశోక్‌రావు, కేసరపు చంద్రయ్య, బండి రాజయ్య, రామడి గట్టయ్య, అరని సత్తయ్య, అజ్మత్ అలీ, బూడిది రాజసమ్మయ్య పాల్గొన్నారు.


