ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

భూపాలపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, సురక్షితంగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పోలీసుశాఖ సూచనలు పాటించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ముప్పులేని ప్రదేశాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకోవాలన్నారు. అనధికారిక విద్యుత్‌ వినియోగించవద్దని, డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తరువాత లౌడ్‌ స్పీకర్‌లను బంద్‌ చేయాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అభ్యంతరకర పాటలు, కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమా లను నిర్వహించేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ సంకీర్త్‌ కోరారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement