మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వందలాది మంది భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉన్న స్వయంభు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు.


