పత్తి పంట ఎదగకపోవడంతో రైతులు దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి అయినా వస్తుందా అని దిగులు చెందుతున్నారు.
చెరువుకెళ్లి మట్టిని తెచ్చేవాళ్లు. భక్తితో ప్రతిమలు తయారు చేసేవాళ్లు. నిష్టగా ఉపవాసం ఉండేవాళ్లు. భజనలు, కీర్తనలతో మండపాల వద్ద గడిపేవారు. ఉప్పు ఒకరు, పప్పు ఒకరు తోచిందల్లా తీసుకొచ్చి అన్నదానం చేసేవారు. తోపుడు బండ్లపై సమీప చెరువులకు నిమజ్జనానికి తీసుకెళ్లేవారు. నిమజ్జన శోభాయాత్రలో నూనె పీపలను కొట్టి శబ్దం చేసేవారు. ఆ మధుర జ్ఞాపకాలు రూపాంతరం చెందినా అంతే ఉత్సాహంగా నేటి తరం ఆ సంప్రదాయం కొనసాగిస్తోంది. ఐదు దశాబ్దాలు దాటిన ఆ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు అందిస్తోంది.
– సాక్షి నెట్‌వర్క్


